ఛాంప్స్ శేఖర్, ప్రతిమ

మన తెలంగాణ/క్రీడా విభాగం: చార్మినార్ ఓపెన్ అఖిల భారత వీల్‌ఛైర్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ శేఖర్ వీరాస్వామి (కర్ణాటక), మహిళల సింగిల్స్‌లో ప్రతిమ రావు (కర్ణాటక) ఛాంపియన్ టైటిళ్లను దక్కించుకున్నారు. శనివారం ఎల్బీ స్టేడియంలోని శాట్స్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో శేఖర్ 6-2, 6-3 తేడాతో బాలచందర్ సుబ్రహ్మణ్యం (తమిళనాడు)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో ప్రతిమ 6-4, 6-0తో శిల్ప (కర్ణాటక)పై గెలిచి ట్రోఫీని అందుకుంది. పురుషుల డబుల్స్‌లోనూ శేఖర్ సత్తాచాటాడు. బాలచందర్‌తో కలిసి బరిలో దిగిన శేఖర్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో శేఖర్- బాలచందర్ జోడీ 6-4, 6-1తో మరియప్పన్- కార్తీక్ (తమిళనాడు) జంటపై నెగ్గింది. శాట్స్ వీసీ, ఎండీ దినకర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

Sunil Jain